మేర్లపాక గాంధీ దర్శకత్వంలో..

భీష్మ సినిమా హిట్‌గా నిలవడంతో ఫుల్‌జోష్‌లో ఉన్న నితిన్‌ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈసారి స్ట్రేట్‌ సినిమాతో కాకుండా రీమేక్‌తో అభిమానులను అలరించనున్నాడు. బాలీవుడ్‌లో గత ఏడాది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన చిత్రం ‘అంధాధూన్‌’.. విభిన్న కథాంశాలను ఎంచుకునే హీరో ఆయుష్మాన్‌ ఖురానా, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా రీమేక్‌ హక్కులను నిర్మాత సుధాకర్‌ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు నితిన్‌ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే.